Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర శిఖరానికి స్వర్ణతాపడంపై కీలక ప్రకటన

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) శిఖరానికి స్వర్ణతాపడం(Golden spire) చేయిస్తామని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర శిఖరానికి స్వర్ణతాపడంపై కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) శిఖరానికి స్వర్ణతాపడం(Golden spire) చేయిస్తామని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆలయ శిఖరం దాదాపు 161 అడుగుల ఎత్తు ఉంటుందని, దాని కొన భాగం నుంచి దాదాపు 10 అడుగుల వరకు స్వర్ణతాపడం ఉంటుందని తెలిపారు. కూలీల సంఖ్యను పెంచడంతో ఆలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మార్చి 15 నాటికి రామమందిరం నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. రామ మందిరం ప్రాంగణంలో ‘సప్త మండప్’ పేరుతో నిర్మిస్తున్న ఏడు చిన్న ఆలయాల పనులు కూడా అప్పటికల్లా పూర్తవుతాయన్నారు.

500 అడుగుల పొడవైన రాయిపై రామకథను చిత్రీకరించే పనులన్నీ పూర్తయ్యాయని, దాన్ని అమర్చే పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మందిరం ఆవరణలోని యాత్రికుల ఫెసిలిటేషన్ సెంటర్, ఫైర్ స్టేషన్, వాటర్ ప్లాంట్ మొదలైన ప్రాజెక్టులను పూర్తి చేసి జనవరిలోగా అయోధ్య రామమందిర ట్రస్టుకు అప్పగిస్తామన్నారు. ఇక బాబ్రీ మసీదు విధ్వంస ఘటన జరిగి డిసెంబరు 6వ తేదీతో 32 ఏళ్లు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో శుక్రవారం రోజులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సరయూ నదిలో బోట్లతో పెట్రోలింగ్ నిర్వహించారు. అయోధ్యలో పలుమార్లు భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి.

Next Story