- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవా ఫైర్ యాక్సిడెంట్ కేవలం ప్రమాదం కాదు.. నేరపూరిత వైఫల్యం: ఎంపీ రాహుల్ గాంధీ
గోవాలోని అర్పొరాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: గోవాలోని అర్పొరాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పై ఎల్ఓసీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అలాగే 25 మంది ప్రాణాలను తీసిన ఈ ఘటన కేవలం ప్రమాదం మాత్రమే కాదని, ద ఈ సంఘటనను కేవలం ప్రమాదంగా చూడలేమని, ఇది భద్రత, పాలనా పరమైన నేరపూరిత వైఫల్యం (Criminal Failure of Safety and Governance)మని రాహుల్ గాంధీ స్థానిక ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే ఇలాంటి నివారించదగిన విషాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే, ఈ ఘటనపై సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరిపి, బాధ్యులను కచ్చితంగా గుర్తించి శిక్షించాలని ఎంపీ రాహుల్ గాంధీ తన ట్వీట్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.






