Goa doctors protest: డాక్టర్లను అవమానించిన మంత్రిపై చర్యలు తీసుకోండి: గోవా వైద్యుల నిరసన

by Shamantha N |

గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)లో వైద్యులపై అసభ్యంగా ప్రవర్తించిన ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణేను అందరూ విమర్శిస్తున్నారు. శనివారం (GMCH)ను ఆకస్మికంగా సందర్శించిన రాణే, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుద్రేష్ కుట్టికర్‌ను రోగులతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బహిరంగంగా సస్పెండ్ చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

Goa doctors protest: డాక్టర్లను అవమానించిన మంత్రిపై చర్యలు తీసుకోండి:  గోవా వైద్యుల నిరసన
X

దిశ, నేషనల్ డెస్క్ : గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)లో వైద్యులపై అసభ్యంగా ప్రవర్తించిన ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణేను అందరూ విమర్శిస్తున్నారు. శనివారం (GMCH)ను ఆకస్మికంగా సందర్శించిన రాణే, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుద్రేష్ కుట్టికర్‌ను రోగులతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బహిరంగంగా సస్పెండ్ చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై సోమవారం రాణే క్షమాపణలు తెలిపారు. డాక్టర్‌ను అవమానించిన తీరును గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (GARD), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గోవా విభాగాలు తీవ్రంగా ఖండించాయి. వారు మంత్రికి 48 గంటల గడువు ఇవ్వగా, రాణే సోషల్ మీడియాలో స్పందిస్తూ “భావోద్వేగంలో వచ్చిన మాటలకు బాధపడుతున్నాను. నేను గౌరవాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు” అంటూ క్షమాపణ చెప్పారు.

బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్

కానీ వైద్యులు మాత్రం ఈ క్షమాపణ సరిపోదని, బహిరంగంగా ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. (GMCH)లోని విభాగాధిపతులు, వైద్య విద్యార్థులు (IMA) సభ్యులు భారీగా నిరసనలో పాల్గొన్నారు. (VIP) కల్చర్‌ను నివారించాలని, ఆసుపత్రి అత్యవసర విభాగాల్లో మీడియా ప్రవేశాన్ని నిషేధించాలని వారు కోరారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ మాట్లాడుతూ.. వైద్యులు రోడ్డెక్కితే అది తక్షణ చర్యల అవసరం ఉన్న సంకేతం అని అన్నారు. రాణే పదవికి రాజీనామా చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Next Story