కర్నాటకను తాకిన గోబ్యాక్ మార్వాడీ ఉద్యమం

by Ajay Maddhiboyina |

తెలంగాణ‌లో గోబ్యాక్ మార్వాడీ ఉద్య‌మం పెద్దఎత్తున జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కార్ ప‌క్క‌కు పార్క్ చేసుకోవాల‌ని కోరినందుకు ఓ మార్వాడీ కుటుంబం ద‌ళిత వ్య‌క్తిపై దాడికి పాల్ప‌డింది.

కర్నాటకను తాకిన గోబ్యాక్ మార్వాడీ ఉద్యమం
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో గోబ్యాక్ మార్వాడీ ఉద్య‌మం పెద్దఎత్తున జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కార్ ప‌క్క‌కు పార్క్ చేసుకోవాల‌ని కోరినందుకు ఓ మార్వాడీ కుటుంబం ద‌ళిత వ్య‌క్తిపై దాడికి పాల్ప‌డింది. కులం పేరుతో దూషించింది. దీంతో ప్ర‌జాసంఘాలు, మేధావులు బాధితుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ గో బ్యాక్ మార్వాడీ నినాదం మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో మార్వాడీలు సిండికేట్ వ్యాపారం చేస్తున్నార‌ని, క్వాలిటీ లేని వ‌స్తువులు అమ్ముతున్నార‌ని అనేక ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీ సెగ క‌ర్నాట‌క‌ను సైతం తాకింది.

బెంగుళూరులోని శివానంద స‌ర్కిల్ లో రాంగ్ రూట్‌లో వచ్చిన మార్వాడీ వ్యక్తి స్థానిక ఆటో డ్రైవర్ పై దాడికి యత్నించాడు. ఆటో డ్రైవర్ సరైన మార్గంలోనే వెళుతుండగా అడ్డుగా వచ్చిన మార్వాడీ వ్యక్తి ఆటో పక్కకు జరపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఆటో డ్రైవర్ తో గొడవకు దిగారు. తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని ఎందుకు పక్కకు జరగాలని ఆటో డ్రైవర్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆటో డ్రైవర్‌కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. మార్వాడీ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో మాదిరిగానే కర్నాటకలోనూ గో బ్యాక్ మార్వాడీ అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. video

Next Story