Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో పని చేశా నేను లొంగిపోను.. సుప్రీం కోర్టులో ఎన్ ఎస్ జీ కమాండో వింత వాదన

by Prasad Jukanti |

భార్య హత్య కేసులో పోలీసుల ఎదుట లొంగిపోకుండా రక్షణ కల్పించాలని ఓ కమాండో సుప్రీంకోర్టును ఆశ్రయించడం వైరల్ గా మారింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో పని చేశా నేను లొంగిపోను..  సుప్రీం కోర్టులో ఎన్ ఎస్ జీ కమాండో వింత వాదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశంలో చాలా మంది నేరం చేసి శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలనేదానిపై కన్నింగ్ ఐడియాలు వేస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు కులం కార్డు వాడుతుంటే మరి కొందరు ప్రాంతం కార్డు ప్రయోగిస్తుంటారు. తాజాగా సుప్రీంకోర్టు ముందు ఓ ఎన్ఎస్ జీ కమాండో చేసిన వింత వాదన అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. తాను ఆపరేషన్ సిందూర్ లో (Operation Sindoor) పని చేశానని అందువల్ల హత్య కేసు ఆరోపణల్లో పోలీసుల ముందు లొంగిపోకుండా మినహాయింపు ఇవ్వాలని కోరాడు. అతని వాదన విన్న సుప్రీంకోర్టు (Supreme Court) అదంతా కుదరదని పోలీసుల ఎదుట లొంగిపోవాలని హెచ్చరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కు (NSG Commando) చెందిన బ్లాక్ క్యాట్ కమెండో ఒకరు తన భార్యను గొంతు నులిమి చంపేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాను బ్లాక్ క్యాట్ కమెండోనని, పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ లో తానూ పాల్గొన్నాను. అందువల్ల పోలీసుల ముందు సరెండ్ కావడం నుంతి తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. ఆపరేషన్ సిందూర్ లో భాగమైనంత మాత్రాన అది పోలీసుల ఎదుట లొంగిపోకుండా రక్షణ కల్పించదు. కేసులో విచారణ కోసం పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో తాను లొంగిపోయేందుకు కొంత సమయం కావాలని సదరు కమెండో తరఫున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయగా అతడి అభ్యర్థన మేరకు కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది.

Next Story