ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసిన అమ్మాయిలు.. నెల రోజులు సస్పెండ్ చేసిన హాస్టల్ వార్డెన్

by Ramesh Naini |

మహారాష్ట్రలోని ఓ హాస్టల్లో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేశారని కారణంతో నలుగురు బాలికలను ఆ హాస్టల్ వార్డెన్ ఇంటికి పంపించేశారు.

ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేసిన అమ్మాయిలు.. నెల రోజులు సస్పెండ్ చేసిన హాస్టల్ వార్డెన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలో (Maharashtra) ని ఓ హాస్టల్లో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో పిజ్జా ఆర్డర్ చేశారని కారణంతో నలుగురు బాలికలను ఆ హాస్టల్ వార్డెన్ ఇంటికి పంపించేశారు. పూణేలోని (Social Welfare Hostel) సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో 250 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హాస్టల్లోని ఓ గదిలో నలుగురు బాలికల్లో ఒకరు పిజ్జా ఆర్డర్ చేసినట్టు హాస్టల్ వార్డెన్ మీనాక్షి దృష్టికి వచ్చింది. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఆన్‌లైన్‌లో పిజ్జా ఎవరు అర్డర్ చేశారో చెప్పాలని వార్డెన్ అమ్మాయిలకు డెడ్‌లైన్ పెడుతూ నోటీసులు ఇచ్చింది.

నలుగురిలో ఎవరు చెప్పకపోయినా బహిష్కరణకు గురవుతారని పేర్కొంది. అయితే నలుగురు బాలికలు ఎవరూ చెప్పకపోవడంతో వార్డెన్ మీనాక్షి వారిని చెప్పినట్లుగానే నెలరోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా వార్డెన్ పిలిపించింది. వారి పిల్లల విద్యా పనితీరుపై కాకుండా సంబంధం లేని విషయాలపై చర్చలు ఎందుకని వార్డెన్‌‌పై తల్లిదండ్రలు మండిపడ్డారని సమాచారం. కాగా, నలుగురు బాలికలపై క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story