కాలేజీ ఫెస్టివల్‌లో అమ్మాయిలు దుస్తులు మార్చుకుంటుండగా.. రహస్యంగా వీడియో రికార్డ్.. ముగ్గురు అరెస్ట్

by Ramesh Naini |

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మంద్‌సౌర్ జిల్లా ప్రభుత్వ కాలేజీలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

కాలేజీ ఫెస్టివల్‌లో అమ్మాయిలు దుస్తులు మార్చుకుంటుండగా.. రహస్యంగా వీడియో రికార్డ్.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Madhya Pradesh) మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మంద్‌సౌర్ జిల్లా ప్రభుత్వ కాలేజీలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కాలేజీ ఫెస్టివల్ సందర్భంగా అమ్మాయిలు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో, నలుగురు అబ్బాయిలు వెంటిలేటర్ ద్వారా రహస్యంగా వీడియోలు రికార్డ్ చేసినట్టు బయటపడింది. తమను ఎవరో వెంబడిస్తున్నట్టు గమనించిన అమ్మాయిలు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, వెంటిలేటర్ వద్ద నుంచి వీడియో రికార్డింగ్ చేస్తున్న దృశ్యాలను గుర్తించించారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వీడియో ఆధారంగా ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. వీడియోలు రికార్డ్ చేసిన వారు బీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులుగా గుర్తించారు. నిందితులు ఉమేశ్ జోషి(22), అజయ్ గౌడ్(21), హిమాన్షు బైరాగి (20)గా గుర్తించారు. విద్యార్థులను కోర్టులో హాజరుపరిచి.. జైలుకు తరలించారు. వారి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో అమ్మాయిల వీడియోలు ఉన్నాయా..? లేదా..? అన్నది ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. భాన్పురా ప్రభుత్వ కళాశాలలో మంగళవారం కాలేజీ ఫెస్టివల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటపై విద్యార్థులు, తల్లిదండ్రులు, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, అరెస్ట్ అయిన ముగ్గురు విద్యార్థులు (ABVP) ఏబీవీపీ కార్యకర్తలు కావడం గమనార్హం. దీంతో ఏబీవీపీ జిల్లా స్థాయి కమిటీ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. వైరల్ వీడియో ఇదే..

Next Story