ఛత్తీస్‌గఢ్‌లో ఘర్ వాపసీ.. గిరిజన క్రిస్టియన్‌లను తిరిగి హిందువులుగా మత మార్పిడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే

by Ramesh Naini |   (  Updated:2025-11-12 06:22:26  IST  )

ఛత్తీస్గఢ్‌లో గిరిజన క్రిస్టియన్‌లను తిరిగి హిందువులుగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మత మార్పిడి చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఘర్ వాపసీ.. గిరిజన క్రిస్టియన్‌లను తిరిగి హిందువులుగా మత మార్పిడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్గఢ్‌లో గిరిజన క్రిస్టియన్‌లను తిరిగి హిందువులుగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మత మార్పిడి చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబీర్ధామ్ జిల్లాలో 41 కుటుంబాలకు చెందిన 125 మంది గిరిజనులు తిరిగి హిందూ మతంలోకి చేరారు. పాండారియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భావనా బోహర (BJP MLA Bhawna Bohra) ఆధ్వర్యంలో తాజాగా ఈ ఘర్ వాపసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావనా బోహర హిందూ మతంలోకి తిరిగి వచ్చిన గిరిజనుల పాదాలను కడిగి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావనా బోహర మాట్లాడుతూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. గత నెల రోజులుగా సుమారు 75 నుండి 80 మంది తిరిగి తమ మాతృ మతంలో చేరారు. ప్రస్తుతం అడవి ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా మాతో సంప్రదిస్తూ, తమ హిందూ మతంలోకి తిరిగి రావాలనే అభిలాష వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మన సంస్కృతిని మరిచిపోతే, మన భవిష్యత్ తరాలకు మన గిరిజన సమాజం గొప్ప చరిత్రను వివరించలేమన్నారు. పంచ భూతాలే గిరిజనుల అసలు గుర్తింపు అని, వీటి నుంచి దూరమవడం సాధ్యం కాదన్నారు.

గతంలో ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగా అనేక గిరిజనులు తమ మూల మతం నుంచి దూరమయ్యారని, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నారని చెప్పారు. భావనా బోహర తన నియోజకవర్గంలో సనాతన సంస్కారాల పరిరక్షణ, గిరిజన సంప్రదాయాల పునరుద్ధరణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆమె చేపట్టిన ఈ కార్యక్రమాల వల్ల అటవీ ప్రాంతాల్లోని అనేక గిరిజన కుటుంబాలు తిరిగి తమ మాతృ మతం వైపు అడుగులు వేస్తున్నాయి. కాగా, న్యూర్, అమనియా, కడ్వానీ, డమ్గఢ్, బీర్హుల్డిహ్ గ్రామాలకు చెందిన గిరిజనులను ఎమ్మెల్యే భావనా బోహర సన్మానించి, వారి “తమ మూల మతం”లోకి తిరిగి వచ్చినందుకు అభినందించారు. వీడియో ఇదే..

Next Story