- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Germany: జర్మనీ విమానాశ్రయాల్లో సమ్మె.. 3400 విమానాలు రద్దు
జర్మనీలోని విమానాశ్రయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి.

దిశ, నేషనల్ బ్యూరో: జర్మనీ(Germany)లోని విమానాశ్రయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సోమవారం దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. ఈ సమ్మె కారణంగా13 ఎయిర్ పోర్టుల్లో (Airports) 3400 విమానాలు రద్దయ్యాయి. అంతేగాక ప్రధాన విమానాశ్రయాలైన ఫ్రాంక్ ఫర్డ్ (Frankfard), మ్యూనిచ్ (Munich) ఎయిర్ పోర్టుల్లో సైతం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉంటే ఫ్రాంక్ ఫర్డ్ ఎయిర్ పోర్టులో 116 విమానాలు రాకపోకలు కొనసాగిస్తుండగా వాటిలో 1054 సర్వీసులు రద్దయ్యాయి. హాంబర్గ్ విమానాశ్రయంలో 300 విమానాలు ఆగిపోయాయి. సుమారు 5లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. బ్రెమెన్, కొలోన్, డార్ట్‌మండ్, డ్యూసెల్‌డార్ఫ్, హాంబర్గ్, హనోవర్, లీప్‌జిగ్ విమానాశ్రయాలు కూడా ప్రభావితమయ్యాయి.
కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వెర్డీ యూనియన్ (Verdi Union) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. నెలకు 8శాతం జీతాల పెంపు లేదా సుమారు 350 యూరోలు ఎక్కువగా చెల్లించడం, అధిక బోనస్ సెలవుల పెంపు వంటివి ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఈ డిమాండ్ చేస్తున్నా యాజమాన్యాలు పట్టించుకోలేదని అందుకే సమ్మెకు దిగామని వెర్దీ యూనియన్ పేర్కొంది. ‘ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం జరుగుతున్న సమిష్టి చర్చలలో యాజమాన్యాలు ఇంకా ఎటువంటి ప్రతిపాదన అందించలేదు. మా చట్టబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి సుముఖత చూపలేదు. అందుకే ముందస్తు హెచ్చరికగా సమ్మెకు దిగాం’ అని తెలిపింది. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది.






