ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై పాక్ దాడి బూటకమేనన్న అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్

by Phanindra |

ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశామని పాక్ చేస్తున్న ప్రచారం అంతా బూటకమేనని అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్ తేల్చిచెప్పారు.

ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై పాక్ దాడి బూటకమేనన్న అంతర్జాతీయ ఎక్స్‌పర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’లో తీవ్రంగా నష్టపోయినప్పటి నుంచి పరువు నిలబెట్టుకునేందుకు అబద్ధాలాడుతూనే ఉంది పాకిస్తాన్. అయితే ప్రస్తున ఇంటర్నెట్ యుగంలో పాక్ అబద్ధాలన్నీ తేటతెల్లం అయిపోతున్నాయి. అయినా ఆ దేశానికి బుద్ధిరావడం లేదు. తాజాగా మరో డిఫెన్స్ ఎక్స్‌పర్ట్.. పాక్ ప్రగల్భాలన్నీ బూటకాలేనని స్పష్టంచేశాడు. భారత్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసి సుఖోయ్ సు-30 విమానాలను పాక్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని పేర్కొన్న రిపోర్టును డామియెన్ సైమన్ అనే అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ నిపుణుడు కొట్టిపారేశాడు. ఈ ఏడాది మార్చి నెలలో అంటే ‘ఆపరేషన్ సిందూర్‌’ జరగడానికి రెండు నెలల క్రితం ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మిగ్-29 విమానాల మెయింటెనెన్స్ జరిగిందని, ఆ ఫొటోలనే పాకిస్తానీ రిపోర్టులు చూపిస్తున్నాయని సైమన్ వివరించాడు. ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ వద్ద ఉన్న నల్లటి మరకలు సర్వసాధారనమని, అది దాడుల వల్ల జరిగిన డ్యామేజ్ కాదని స్పష్టంచేశాడు.

కాగా, చైనా నుంచి కొన్న జేఎఫ్-17 ఫైటర్ జెట్‌తో భారత్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశామని, అక్కడి ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశామని పాక్ చెప్పిన సంగతి తెలిసిందే. పాక్ ఇలా ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ నేరుగా ఆదంపూర్ ఎయిర్‌బేస్ వెళ్లి ఎస్-400 వ్యవస్థ ముందు నిలబడి పాక్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Next Story