- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామూహిక గీతా పారాయణం.. ఆరున్నర లక్షల మంది హాజరు
by Muthe.Rajitha |
పశ్చిమ బెంగాల్ గీతా పారాయణతో మారమ్రోగిపోయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ గీతా పారాయణంతో మారమ్రోగిపోయింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం 'సనాతన సంస్కృతి సంసద్' సంస్థ నిర్వహించిన 'ఐదు లక్షల స్వరాలతో గీతా పారాయణం' విజయవంతం అయింది. ఈ సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమానికి ఆరున్నర లక్షల మంది హాజరయ్యారు. బెంగాల్‌తోపాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు, వివిధ మఠాలకు చెందిన సాధువులు తదితరులు పెద్దఎత్తున తరలి వచ్చారు. కాగా ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సామూహిక గీతా పారాయణమని నిర్వాహకులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ తదితరులు పాల్గొని భగవద్గీత శ్లోకాలు పఠించారు. రాష్ట్ర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, పవిత్ర గ్రంథాల ద్వారా సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Next Story






