GBS Virus : జీబీఎస్ వైరస్ అటాక్..పెరుగుతున్న మరణాలు

by Y. Venkata Narasimha Reddy |

కరోనా రేపిన భయాన్ని జనం మరువకుండానే గిలియన్ బారే సిండ్రోమ్(GBS) మరణాలు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో పాజిటీవ్ కేసుల రిజిస్ట్రేషన్లతో ఉనికి చాటిన జీబీఎస్ వైరస్ ఉహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది.

GBS Virus : జీబీఎస్ వైరస్ అటాక్..పెరుగుతున్న మరణాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా రేపిన భయాన్ని జనం మరువకుండానే గిలియన్ బారే సిండ్రోమ్(GBS) మరణాలు దేశ ప్రజలను వణికిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో పాజిటీవ్ కేసుల రిజిస్ట్రేషన్లతో ఉనికి చాటిన జీబీఎస్ వైరస్ ఉహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుంది. క్రమంగా జీబీఎస్ మరణాల సంఖ్య పెరుగుతుండం ఆందోళన రేకెత్తిస్తుంది. మహారాష్ట్రలోని పూణేలో జీబీఎస్ కేసుల సంఖ్య 149కి చేరుకుంది. నాందేడ్ లో 60ఏండ్ల వృద్ధుడు చికిత్స పొందుతు చనిపోగా ఆ రాష్ట్రంలో జీబీఎస్ మరణాలు సంఖ్య 5కు చేరుకుంది.

నాందేడ్లో 60ఏండ్ల వృద్ధుడు చికిత్స పొందుతు చనిపోయాడు. అస్సాంలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. తాజాగా తెలంగాణాలో డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. సిద్దిపేటకు చెందిన మహిళకు పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ఆమెకు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో గులియన్ బారే సిండ్రోమ్(GBS) కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దగ్గినా.. తుమ్మినా.. జ్వరం వచ్చినా సరే జీబీఎస్ అటాక్‌ అయిందా? అని హడలిపోతున్నారు.

గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు

కలుషిత ఆహారం.. బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గులియన్ బారే సిండ్రోమ్‌ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయని..ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స పొందాలని సూచిస్తున్నారు. బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారినపడే ఎక్కువగా పడనున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రజలు జీబీఎస్ సిండ్రోమ్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అంటువ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

కరోనాలా ఇది అంటువ్యాధి కాదని..ఆందోళన చెందాల్సిన పనిలేదని, అప్రమత్తత పాటించి వైరస్‌ లక్షణాలు కన్పిస్తే వెంటనే చికిత్స పొందితే సరిపోతుందంటున్నారు. ప్రజలు బయట తినడం మానుకోవాలని.. ఆహారం, నీటి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ ఇన్‌ఫెక్షన్‌ మొదలైన ఒకట్రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుందని.. సకాలంలో వైద్యం తీసుకుంటే భయం అవసరం లేదని...వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే.. 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుందని. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చంటున్నారు.

Next Story