- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaza: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 22 మంది మృతి
పిల్లలు, మహిళలు సహా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నా గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు.

దిశ, నేషనల్ బ్యూరో: పిల్లలు, మహిళలు సహా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నా గాజాలో ఇజ్రాయెల్ (Israel) దాడులు ఆపడం లేదు. పలు ప్రాంతాల్లో ఆదివారం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనల్లో 22 మంది మరణించగా అనేక మంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. జబాలియాలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో ఏడుగురు మరణించారని పౌర రక్షణ సంస్థ ప్రతినిధి మహమూద్ బస్సాల్ తెలిపారు. అలాగే సెంట్రల్ గాజాలోని నుసెరాత్ చుట్టూ నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందుతున్న గుడారాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఏడు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళతో సహా మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో మృతి చెందిన వారి సంఖ్య 53,939కి చేరుకుంది. మార్చి 18న కాల్పుల విరమణ విఫలమైనప్పటి నుంచే 3,785 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.






