- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gaza: గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. 48 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి భీకర స్థాయికి చేరుకుంది. గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) యుద్ధం మరోసారి భీకర స్థాయికి చేరుకుంది. గాజాపై ఇజ్రాయెల్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. దీంతో కేవలం 48 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు (Palasthinas) ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరణించిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ఖాన్ యూనిస్, రఫా నగరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వైమాణిక దాడులు చేసింది. ఉగ్రవాద సంస్థ హమాస్ తమ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. గాజా అంతటా దాడులను తీవ్రతరం చేస్తామని, ఆ ప్రాంతంలో భారీ భద్రతా మండలాలను ఆక్రమించుకుంటామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దాడులను తీవ్రతరం చేసింది.
గాజాలో వేలాది మంది పిల్లలకు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని, ప్రజలు రోజుకు ఒక సారి కూడా ఆహారం తినలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గాజా ప్రజలకు మెడిసిన్, ఆహారం అత్యంత అత్యవరసమని తెలిపింది. అయితే గత కొన్ని రోజులుగా గాజాకు ఆహార సరఫరాను ఇజ్రాయెల్ నిషేధించింది. దీంతో గాజాలో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో 51,700 మంది పాలస్తీనియన్లు మరణించారు. 1,16, 505 మంది గాయపడ్డారు. అంతేగాక వేలాది మంది నిరాశ్రయులయ్యారు.






