Gaza: గాజాలో తీవ్ర విషాదం.. 52,243 మంది మృతి

by B.Srinivas |

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘర్షణలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 52,243 కు చేరుకుంది.

Gaza: గాజాలో తీవ్ర విషాదం.. 52,243 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ (Israel Hamas) మధ్య జరుగుతున్న యుద్ధంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘర్షణలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 52,243 కు చేరుకుంది. ఈ మేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వివరాలు వెల్లడించింది. గతంలో తప్పిపోయిన 697 మందిని మరణించినట్టు ధ్రువీకరించి వారిని సైతం గణాంకాల్లో చేర్చారు. వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఇటీవల పూర్తయిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే మరో 1,17,600 మంది గాయపడ్డారని వెల్లడించింది. అయితే గాజా అధికారులు, సైనికులు, పౌరుల మధ్య తేడాను గుర్తించడంలో గాజా అధికారులు విఫలమయ్యారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జనవరి 19న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అనంరం రెండో దశ సీజ్ ఫైర్‌పై చర్చలు జరగకపోవడంతో మార్చి18న ఈ ఒప్పందం ముగిసింది. దీంతో ఇజ్రాయెల్ గాజాపై తన దాడులను ముమ్మరం చేసింది. ప్రతి రోజూ గాజా ప్రాంతంపై విరుచుకుపడుతోంది. 50 శాతం భూభాగాన్ని ఇప్పటికే తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా కాల్పుల విరమణ ముగిసిన తర్వాత జరిగిన దాడుల వల్ల 2,151 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

Next Story