- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెదర్లాండ్స్ ప్రధానిగా 'గే'
నెదర్లాండ్స్ ప్రధానిగా తొలిసారి ఒక 'గే' ఎన్నికయ్యి సంచలనం సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్ : నెదర్లాండ్స్ ప్రధానిగా తొలిసారి ఒక 'గే' ఎన్నికయ్యి సంచలనం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీ66 సెంట్రిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్, 38 ఏళ్ల రాబ్ జెట్టన్ ప్రధానిగ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రధానిగా ఎన్నికైన అందరిలో జెట్టన్ అత్యంత చిన్న వయస్కుడు కావడం విశేషం. అది మాత్రమే కాదు.. రాబ్ జెట్టన్ తాను 'గే'నని ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రకటించుకున్నాడు. ఎన్నికల్లో వారి పార్టీ భారీ ఆధిపత్యాన్ని సాధించడంతో.. ప్రధాని పదవి చేపట్టనున్న జెట్టన్ తొలి 'గే' కావడం రికార్డులకు ఎక్కనుంది.
ఈ ఫలితాలపై జెట్టన్ మాట్లాడుతూ... ఇది చారిత్రాత్మక విజయం అని, ప్రజలు గొప్ప బాధ్యతను తమపై ఉంచారని, తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. అయితే రాబ్ జెట్టన్ అర్జెంటీనా హాకీ ప్లేయర్ నికోలస్ తో 3 ఏళ్ల కిందట జెట్టన్ ఎంగేజ్మెంట్ చేసుకోగా, ప్రస్తుతం వారు ఇరువురు కలిసే ఉంటున్నారు.






