- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారీలో కీ రోల్ అతడిదే: ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గౌతమ్ మల్హోత్రాకు సీబీఐ రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో పలు అనుమానాలతో బుధవారం ఉదయం గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గౌతమ్ మల్హోత్రాకు సీబీఐ రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో పలు అనుమానాలతో బుధవారం ఉదయం గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా అమిత్ అరోరా, విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేశామని ఈడీ తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో గౌతమ్ కీలక వ్యక్తి అని, ఈయన ఇల్లు, ఆఫీస్‌లలో సోదాలు చేశామని ఈడీ స్పష్టం చేసింది. ఎల్1, ఎల్7 కంపెనీలు గౌతమ్ మల్హోత్రా పరిధిలో ఉన్నాయని, లిక్కర్ హోల్ సేల్, రిటైల్‌లో గౌతమ్‌కు బిజినెస్‌లు ఉన్నాయని తెలిపింది. అమిత్ అరోరా, దినేష్ ఆరోరా, మల్హోత్రా కలిసి వ్యాపారం చేశారని గౌతమ్ వైన్స్, గౌరవ్ వైన్స్, ఎల్7 వైన్స్ ఉన్నాయి తెలిపింది.
నోటీసులు ఇచ్చాకే అల్హోత్రాను అరెస్ట్ చేశామన్న ఈడీ.. మరింత విచారించేందుకే కస్టడీకి కోరుతున్నామని కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా మల్హోత్రా తరపున నాయవాది వాదనలు వినిపిస్తూ.. అరెస్టు చేసిన ప్రతి ఒక్కరిని ఈడీ రిమాండ్ కోరుతోందని మల్హోత్రాను ఎందుకు అరెస్టు చేశారో ఈడీకే తెలియదన్నారు. ఈడీ ఛార్జ్ షీట్‌లో మల్హోత్రా పేరు లేదని ఒక్క కేసులో ఎన్ని ఛార్జ్ షీట్‌లు వేస్తారని ప్రశ్నించారు. మాల్హోత్రా లిక్కర్ వ్యాపారం వల్ల నష్టపోయినప్పటికీ ఈడీ మాత్రం ప్రాఫిట్ పొందాడని చెబుతోంది. అర్థరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు. విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తున్నా అరెస్టు ఎందుకు? రిమాండ్ ఎందుకు? అని ప్రశ్నించారు.
Read more:
బిగ్ న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో MLC కవితకు బిగుస్తున్న ఉచ్చు?






