- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యురేటర్‌తో గంభీర్ గొడవ.. హీటెక్కిన ‘ది ఓవల్’ స్టేడియం!
‘ది ఓవల్’ స్టేడియం క్యురేటర్‌తో గంభీర్ గొడవ పడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో లీ ఫార్టిన్, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ మరో గొడవలో చిక్కుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు కోసం ‘ది ఓవల్’ స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గంభీర్, పిచ్ క్యురేటర్ లీ ఫార్టిస్ మధ్య గొడవ జరిగింది. ఒక పిచ్‌పై భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా ఫార్టిస్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గంభీర్‌కు కోపం వచ్చేసింది. ఫార్టిస్‌తో వాగ్వాదానికి దిగాడు.
‘ఎవరికి ఏం రిపోర్ట్ చేసుకుంటావో చేసుకో. మేం ఏం డ్యామ్ చేయడం లేదు. మేం ఏం చేయాలో చెప్పడానికి నువ్వెవరు? నువ్వు జస్ట్ గ్రౌండ్ స్టాఫ్‌లో ఒకడివి అంతే’ అంటూ ఫార్టిస్‌పై మండిపడ్డాడు. ఇదే సమయంలో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వచ్చి ఫార్టిస్‌ను పక్కకు తీసుకెళ్లి, గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఈ ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఫార్టిస్.. గంభీర్‌ను తానెప్పుడూ కలవలేదని, అతను సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేది తనకు అనవసరమని అన్నాడు. అయితే ఏం జరిగిందనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఏమైనా ప్రశ్నలుంటే నేరుగా గంభీర్‌నే అడగండంటూ వెళ్లిపోయాడు.
దీనిపై సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. ‘ఒక గ్రౌండ్ స్టాఫ్ వచ్చి.. మేం వికెట్‌కు 2.5 మీటర్ల దూరంలో నిలబడాలని చెప్పాడు. నేను ఎప్పుడూ ఇలాంటి కండిషన్ వినలేదు. దీనిపై కంప్లయింట్స్ ఏముంటాయి? క్యురేటర్ అంత ఫ్రెండ్లీ కాదని మాకు తెలుసు. కానీ ఇంత గొడవ ఎందుకు? మేం స్పైక్స్ వేసుకోలేదు. జస్ట్ జాగర్స్ వేసుకొని ఉన్నాం. కాబట్టి పిచ్‌కు ఎలాంటి ఇష్యూ ఉండదు కదా’ అని వివరించారు.






