USA: ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ అరెస్టు

by Shamantha N |

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ హర్ ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అరెస్టయ్యాడు.

USA: ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ హర్ ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అరెస్టయ్యాడు. పంజాబ్‌లోని 14 గ్రనేడ్‌ దాడులతో సంబంధం ఉన్న అతడు అమెరికాలో అరెస్టయ్యాడు. గత ఏడు నెలల్లో పంజాబ్ లో మొత్తం 16 గ్రనేడ్ దాడులు జరిగాయి. అందులోని 14 ఘటనల్లో పాసియాకు సంబంధం ఉంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్, ప్రార్థనా మందిరాలు, ప్రముఖుల ఇళ్లపై, ఇటీవలే బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటిపైనా దాడులు జరిగాయి. కాగా.. ఈ కేసు దర్యాప్తులో దాడుల సూత్రధారిగా హ్యాపీ పేరు బయటపడింది. మరోవైపు, పాసియాపైన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ. 5 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. అమెరికాలో ఎఫ్బీఐ, యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు అతడ్ని అరెస్టు చేశారు. కాగా.. అతడి అరెస్టుని ధ్రువీకరిస్తూ ఎఫ్బీఐ ప్రకటన విడుదల చేసింది. "భారతదేశంలోని పంజాబ్‌లో ఉగ్రవాద దాడులకు కారణమైన ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్‌ను ఎఫ్బీఐ, ఈఆర్వో అరెస్టు చేశాయి. రెండు అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న అతను చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించాడు." అని తెలిపింది.

బబ్బర్ ఖల్సాతో సంబంధాలు..

ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఐఏ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ఉగ్ర సంస్థకు చెందిన నలుగురిపై కేసులు పెట్టారు. ఈ జాబితాలో పాసియా పేరుతోపాటు.. పాక్‌కు చెందిన హర్వీందర్‌ సింగ్‌ సంధు అలియాస్‌ రిండా కూడా ఉన్నారు. ‘‘ ఈ దాడులకు రిండా, హ్యాపీ పాసియా రూపుకల్పన చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ దాడుల కోసం రోహన్‌ మిషా, విశాల్‌ మిషాలను నియమించుకొన్నారు. వీరే దాడులు నిర్వహించారు’’ అని ఎన్‌ఐఏ అప్పట్లో ప్రకటించింది. 2024లో ఛండీగఢ్‌లో గ్రనేడ్‌ దాడికి సంబంధించి జనవరి 22న యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో మొత్తం 16 చోట్ల ఈ సంస్థ తనిఖీలు నిర్వహించింది. మాజీ పోలీస్‌ అధికారి జేఎస్‌ చాహల్‌ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నిధులను సమకూర్చినట్లు పేర్కొంది.

Next Story