- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రయాగ్ రాజ్ జైలుకు గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్
బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షి ఉమేష్ పాల్ ను హత్య చేసిన ఘటనలో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్‌ను స్థానిక కోర్టులో హాజరు పరిచారు.

దిశ, వెబ్ డెస్క్: బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో సాక్షి ఉమేష్ పాల్ ను హత్య చేసిన ఘటనలో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్‌ను స్థానిక కోర్టులో హాజరు పరిచారు. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలుకు అతడిని తీసుకువచ్చారు. అదేవిధంగా రాయ్ బరేలీ నుంచి తీసుకువచ్చిన అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీమ్ అలియాస్ అష్రఫ్, మరో సహ నిందితుడు ఫర్హాన్‌లను అదే జైలులో వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు.
ప్రయాగ్‌రాజ్ జైలులో అతిక్ కోసం భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సీనియర్ జైలు సూపరింటెండెంట్ శశికాంత్ సింగ్ ముగ్గురు నిందితులను మొదట వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. జైలు ప్రధాన కార్యాలయంలో ఉన్న అతిక్ అహ్మద్ సెల్‌లో ప్రత్యేక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. జైలు మాన్యువల్ ప్రకారం ముగ్గురికి భోజనం వడ్డించారు. రాత్రి భోజనంలో పప్పులు, బియ్యం, కూరగాయలు, రోటీలు అందజేశారు.






