- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీఫక్కీలో చేజింగ్.. ఎదురు కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ హతం
by Muthe.Rajitha |
ఓ గ్యాంగ్ స్టర్ ను అరెస్ట్ చేసేందుకు సినీఫక్కీలో ఛేజింగ్ చేయాల్సి వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ గ్యాంగ్ స్టర్ ను అరెస్ట్ చేసేందుకు సినీఫక్కీలో ఛేజింగ్ చేయాల్సి వచ్చింది. చివరకి గ్యాంగ్ స్టర్, అతని బృందం కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాగా ఈ కాల్పుల్లో ఓ కరుడు గట్టిన నేరస్తుడు మృతి చెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిదోలీ సమీపంలోని దట్టమైన అడవుల్లో అర్ధరాత్రి బవేరియా గ్యాంగ్ లీడర్ మిథున్ తోపాటు, అతని అనుచరులు ఉన్నట్టు సమాచారం అందింది. అయితే పోలీసులు చుట్టుముట్టగానే వారంతా పారిపోయేందుకు ప్రయత్నం చేసారు.
ఈ క్రమంలో పోలీసుల మీదికి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మిథున్ హతం కాగా, అతని అనుచరులు తప్పించుకున్నారు. కాగా ఈ చేజింగ్, ఎదురు కాల్పుల్లో ఒక కానిస్టేబుల్ గాయపడగా, మరో పోలీస్ ఇన్‌స్పెక్టర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారని సమాచారం.
Next Story






