- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gangrape: రాజస్థాన్‌లో దారుణం.. మహిళపై ఏడుగురు వ్యక్తుల గ్యాంగ్ రేప్
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి 11 రోజుల పాటు బందీగా ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి 11 రోజుల పాటు బందీగా ఉంచి లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని అల్వార్‌లో నివాసముండే ఓ మహిళ ఏప్రిల్ 24న రాత్రి తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు వ్యక్తులు వారితో కలిశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. అలాగే 11 రోజుల పాటు బందీగా ఉంచి పదే పదే లైంగిక దాడి చేశారు. చివరికి 11 రోజుల తర్వాత బాధితురాలిని ఓ రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉండగానే వదిలి పారిపోయారు.
విషయం బయటికి చెబితే దాడి చేస్తుండగా తీసిన వీడియోలో సోషల్ మీడియాలో పెడతామని, చంపేస్తామని బెదిరించారు. ఇంటికి చేరుకున్న మహిళ తన కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. కానీ నిందితులకు బయపడి పోలీసులకు ఫిర్యాధు చేయలేదు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె పిటిషన్‌ను పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణను డీఎస్పి స్థాయి అధికారికి అప్పగించారు.






