ఒడిశాలో దారుణం.. టీనేజ్ హాకీ క్రీడాకారిణిపై కోచ్‌లు సామూహిక అత్యాచారం

by Naga Rani Yarlagadda |

ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తోన్న ఈ రోజుల్లోనూ ఇంకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి.

ఒడిశాలో దారుణం.. టీనేజ్ హాకీ క్రీడాకారిణిపై కోచ్‌లు సామూహిక అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తోన్న ఈ రోజుల్లోనూ ఇంకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో పదిహేనేళ్ల టీనేజర్ హాకీ క్రీడాకారిణిపై ఆమె కోచ్ లే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. రూర్కెలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్లో చోటు చేసుకుంది. బాధిత యువతి గడిచిన రెండేళ్లుగా ఆ కేంద్రంలో శిక్షణ పొందుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 3వ తేదీ సాయంత్రం స్థానిక స్టేడియంలో కోచింగ్ సెషన్ పూర్తయిన తర్వాత నలుగురు కోచ్ లు సదరు క్రీడాకారిణిని లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపించింది. విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించినట్లు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై బాధిత యువతి జులై 21వ తేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురు కోచ్ లను అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. వారిపై బీఎన్ఎస్ లోని వివిధ సెక్షన్లతో పాటు సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం సెక్షన్ 6 కింద కేసులు నమోదు చేశారు. సోమవారం బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

Next Story