తుపాకీతో బెదిరించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. తర్వాత పందుల కొట్టంలో పడేసిన నిందితులు.. సంచలనం రేపుతున్న ఘటన

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-27 08:00:20  IST  )

ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌లోని బుధానాలో దారుణం చోటు చేసుకుంది. పదిహేనేళ్ల ఇద్దరు మైనర్ బాలికలను తుపాకీతో బెదిరించిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు.. ఊరి చివరకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. రాత్రంతా టార్చర్ చేశారు.

తుపాకీతో బెదిరించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్.. తర్వాత పందుల      కొట్టంలో పడేసిన నిందితులు.. సంచలనం రేపుతున్న ఘటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్‌లోని బుధానాలో దారుణం చోటు చేసుకుంది. పదిహేనేళ్ల ఇద్దరు మైనర్ బాలికలను తుపాకీతో బెదిరించిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలు.. ఊరి చివరకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. రాత్రంతా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అయిన మైనర్లపై ప్రదీప్ కుమార్ అలియాస్ బాబు (20), గౌరవ్ (21).. జులై 24న తుపాకీ బెదిరింపుతో అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితులు బాధితులకు తెలిసిన వారే కాగా రాత్రి 10:30 గంటల సమయంలో ఫోన్ కాల్ ద్వారా బెదిరించి.. రాకపోతే వారి తల్లిదండ్రులను చంపేస్తామని హెచ్చరించారు. గ్రామం వెలుపల ఉన్న ఓ పందుల ఫామ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బయటకు చెప్తే బాధితుల కుటుంబాలను చంపేస్తామని.. వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు.

అయితే ఇదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఇద్దరు అమ్మాయిలు భయపడుతూ కనిపించడంతో బుధానా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అసలు విషయం చెప్పారు. సామూహిక అత్యాచారం, కిడ్నాప్, POCSO చట్టం కింద నిందితులపై FIR నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేయగా.. బాధితుల వైద్య పరీక్షలు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

Next Story