Gang Rape: కాబోయే భర్త ముందే యువతిపై గ్యాంగ్ రేప్.. ఒడిశాలో దారుణ ఘటన

by B.Srinivas |

ఒడిశాలో దారుణ ఘటన చోటు చేసుకుంది . ఓ 21 ఏళ్ల యువతిపై ఆమెకు కాబోయే భర్త ముందే సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

Gang Rape: కాబోయే భర్త ముందే యువతిపై గ్యాంగ్ రేప్.. ఒడిశాలో దారుణ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో దారుణ ఘటన చోటు చేసుకుంది . ఓ 21 ఏళ్ల యువతిపై ఆమెకు కాబోయే భర్త ముందే సామూహిక లైంగిక దాడి (Gang rape)కి పాల్పడ్డారు. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నయాగఢ్ జిల్లా(Nayagad distric)కు చెందిన ఓ యువతి తనకు కాబోయే భర్తతో కలిసి ఫతేఘర్ రామ్ ఆలయానికి(Ram Temple) వెళ్లి తిరిగి వస్తుండగా స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో కొందరు దుండగులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఇద్దరిని బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి యువతితో ఉన్న వ్యక్తిని కత్తితో బెదిరించారు. ఈ క్రమంలోనే యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేగాక ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత అక్టోబర్ 24న పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. శనివారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, ఒడిశాలో ఒక నెల వ్యవధిలోనే రెండో లైంగిక దాడి కేసు నమోదు కావడం గమనార్హం. అంతకుముందు ఈ నెల మొదటి వారంలోనూ జాజ్‌పూర్‌లో మైనర్‌పై లైంగిక దాడి చేసినందుకు గాను 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story