హైకోర్టును ఆశ్రయించిన గాలి జనార్దన్ రెడ్డి

by velandi.Saikiran |

గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardan Reddy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు గాలి జనార్

హైకోర్టును ఆశ్రయించిన గాలి జనార్దన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardan Reddy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు గాలి జనార్దన్ రెడ్డి. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు గాలి జనార్దన్ రెడ్డి. ఇక గాలి జనార్థన్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేపట్టారు జస్టిస్ కె.లక్ష్మణ్. ఓఎంసీ కేసులో భాగంగా గాలి జనార్దన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 58 కిలోల బంగారం, వజ్రా భరణాలను స్వాధీనం చేసుకుంది సీబీఐ బృందం.


అయితే సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేయాలని సీబీఐ కోర్టు తీర్పు తీసుకుంది. ఈ తరుణంలోనే ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు గాలి జనార్థన్ రెడ్డి. దింతో కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు సీబీఐ తరఫు న్యాయవాది. తదుపరి విచారణ 22వ తేదీకి వాయిదా వేశారు. ఇది ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి భారీ ఊరట లభించింది.

ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు విధించిన శిక్షను నిలిపివేసింది హైకోర్టు. అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. 10 లక్షల షూరిటీ కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అలాగే ఇండియాను విడిచి వెళ్లకుండా... పాస్ పోర్టు సరెండర్ చేయాలని కూడా గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story