- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gadkari: అమెరికాకు పోటీగా ఈశాన్య రాష్ట్రాల రోడ్లు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశ వ్యాప్తంగా హైవేలను, మౌలిక సదుపాయాలకు మెరుగుపర్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని నితిన్ గడ్కరీ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా హైవేలను, మౌలిక సదుపాయాలకు మెరుగుపర్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkaree) తెలిపారు. దీనికి గాను వచ్చే రెండేళ్లలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్టు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, త్వరలోనే ఈ ప్రాంతాల్లోని రోడ్లు అమెరికా రోడ్లకు పోటీగా ఉంటాయన్నారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. దేశంలోని మౌలిక సదుపాయాలను ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటికి అనుగుణంగా మార్చడానికి కేంద్రం కృషి చేస్తోందన్నారు.
ఈశాన్య ప్రాంతాలు సరిహద్దులకు దగ్గరగా ఉన్నందున మౌలిక సదుపాయాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. నేషనల్ హైవే నెట్ వర్క్ (High way net work) పొడవు భారీగా విస్తరించిందని 2014 మార్చిలో 91,287 కిటోమీటర్లు ఉండగా ప్రస్తుతం 1,46,204 కిలోమీటర్లకు పెరిగిందని తెలిపారు. అంతేగాక రెండు లేన్ల కంటే తక్కువ ఉన్న జాతీయ రహదారుల నిష్పత్తి బాగా పడిపోయిందనని చెప్పారు.






