Budget 2024: రూ.48.21 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్‌

by Shamantha N |   (  Updated:2024-07-23 08:02:47  IST  )

సామాన్యులే లక్ష్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ని కేంద్రమంత్రి నిర్మలాసీతారమన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

Budget 2024: రూ.48.21 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: సామాన్యులే లక్ష్యంగా వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ని కేంద్రమంత్రి నిర్మలాసీతారమన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు.ఈఏడాది వివిధ రంగాలకు కలిపి రూ.48.21 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్‌ ప్రకటించారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. కాగా.. ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండొచ్చని తెలుస్తోంది. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లగా ఉండనున్నాయి. 9 అంశాలను ప్రాధాన్యతే ఆధారంగా బడ్జెట్ ని రూపొందించరు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.


Click Here For Budget Updates!

Next Story