మదీనా బస్సు ప్రమాద బాధితుల అంత్యక్రియలు పూర్తి

by Malleboina Mahesh |

సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోయారు. ఇందులో మొత్తం 42 మంది భారతీయులు సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

మదీనా బస్సు ప్రమాద బాధితుల అంత్యక్రియలు పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది చనిపోయారు. ఇందులో మొత్తం 42 మంది భారతీయులు సహా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో కేవలం ఒకరు మాత్రమే గాయాలతో బయటపడగా.. మరణించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఉన్నారు. అయితే విషాద సంఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బ‌ృందాన్ని సౌదీకి పంపింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మదీనాకు చేరుకుని బాధితుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మదీనా పవిత్ర స్థలమైన జన్నత్ ఉల్ బఖీ సమాధి స్థలంలో బాధితుల మృతదేహాలను ఖననం చేశారు.

ఈ కార్యక్రమంలో భారత రాయబారి డాక్టర్ సుహెల్ ఖాన్, కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి కూడా పాల్గొన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులతో కలిసి వారు చివరి నమస్కారాలు తెలియజేశారు. Embassy of India in Riyadh ఈ సమాచారాన్ని అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కాగా ఇందులో మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించని వారు ఉండటంతో కుటుంబ సభ్యుల DNA నమూనాల సేకరణ కూడా జరుగుతోంది. స్థానిక సహాయానికి జెడ్డా భారత కాన్సులేట్ 24 గంటల ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసి, బాధితుల కుటుంబాలతో సమన్వయం చేస్తోంది.

Next Story