- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరదా ఈత విషాదాంతం.. స్విమ్మింగ్‌పూల్‌లో ముంచి స్నేహితుడ్ని చంపిన అబ్బాయి
ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు స్విమ్మింగ్ పూల్ ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు స్విమ్మింగ్ పూల్ ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్నేహితుడి చేతిలో దారుణంగా హత్యకు గురికాగా, మరొకరు అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచారు.
సంభల్‌లో దారుణం..
సంభల్ జిల్లా సలార్‌పూర్ కలాన్ గ్రామంలోని స్విమ్మింగ్ పూల్‌లో దారుణం చోటుచేసుకుంది. సరదాగా ఈత కోసం వెళ్లిన సోహెల్ (18) అనే యువకుడిని, అతని స్నేహితుడే నీటిలో ముంచి కిరాతకంగా హత్య చేశాడు. బాధితుడు ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నా కనికరించకుండా, సుమారు రెండు నిమిషాల పాటు నీటిలో అలాగే అణచి ఉంచాడు. ఈ దారుణ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న గుర్తు తెలియని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
దాస్నాలో మరో విషాదం..
దాస్నా ప్రాంతంలోని రాయల్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన మరో ఘటనలో శంతను ఠాకూర్ (25) అనే యువకుడు మృతి చెందాడు. గ్రేటర్ నోయిడాకు చెందిన శంతను తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. పూల్‌లోకి దిగిన కాసేపటికే అపస్మారక స్థితిలో నీటిపై తేలుతూ కనిపించాడు. స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించి నప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 5.5 అడుగుల లోతున్న పూల్‌లోకి దిగిన కేవలం మూడు నిమిషాల్లోనే అతడు అపస్మారక స్థితికి చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన అనంతరం పూల్ నిర్వాహకులు మాజిద్ అలీ, రషీద్ అలీ అక్కడి నుంచి పరారయ్యారు. నిబంధనల ప్రకారం పూల్‌లో సర్టిఫైడ్ కోచ్‌లు ఉన్నారా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.






