- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురికివాడ నుంచి విల్లాకు.. మతమార్పిడి-సెక్స్ రాకెట్ కేసులో భోపాల్ సిస్టర్స్ అరెస్టు
ఉపాధి పేరుతో పేద యువతులను ట్రాప్ చేసి ఆపై వారిని బలవంతంగా సెక్స్ చేయాలని, మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసిన ఆరోపణలపై భోపాల్ సిస్టర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పేద అమ్మాయిల అవసరాలను ఆసరగా చేసుకుని ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేసిన అరాచకాలు సంచలనం రేపుతున్నాయి. మొన్నటి వరకు మురికివాడలో గడిపిన ఈ సిస్టర్స్ ఇప్పుడు కోట్లకు పడగలెత్తి ఖరీదైన విల్లాల్లో జీవనం సాగిస్తుండటం చర్చనీయాశం అయింది. అయితే వీరి విలాసాల వెనుక అమాయకపు మహిళల చీకటి బతుకులు ఉన్నాయని, పేద యువతులతో బలవంతంగా సెక్స్, మతమార్పిడి చేయించి క్యాష్ చేసుకుంటున్నారని తాజాగా పోలీసులకు అందిన ఫిర్యాదుతో వెల్లడైంది. దీంతో ఉపాధి పేరుతో మహిళల్ని వంచిస్తున్న ఈ సిస్టర్స్ బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
సెక్స్, మత మార్పిడి ఆరోపణలు:
మధ్య ప్రదేశ్‍లోని అబ్బాస్ నగర్‍లో ఓ సాధారణ మురికివాడలో నివసించే అమ్రీన్, అఫ్రీన్ సిస్టర్స్ ఇటీవల రాష్ట్ర రాజధాని భోపాల్ లోని సాగర్ రాయల్ విల్లాస్‍లోని ఓ విలాసవంతమైన విల్లాకు మకాం మార్చారని అయితే వీరి జల్సాల వెనుక భయంకరమైన చేదు నిజాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. గత ఆదివారం ఈ ఇద్దరిపై వచ్చిన ఫిర్యాదుతో అమ్రీన్, అఫ్రీన్ సిస్టర్స్ తో పాటు వారి సహచరుడు చందన్ యాదవ్‍ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఇద్దరు సిస్టర్స్ ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువతులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి మంచి జీతం, ఉచిత భోజన వసతి, షెల్టర్ కల్పిస్తామని వల వేస్తున్నారు. ఇంటి పనులు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలకు మాయమాటలు చెప్పి వారిని ట్రాప్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ యువతులను క్రమంగా పార్టీలు, పబ్బులకు తీసుకువెళ్తూ అక్కడ ఉండే ధనవంతులతో సెక్స్ లో పాల్గొనాలని బలవంతం చేస్తున్నారు. నిందితుల సన్నిహితుడు చందన్ యాదవ్ ఓ బాధితురాలితో తాను ఇస్లాంలోకి మారాను. మీరు కూడా మారితే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడని అంతటితో ఆగకుండా వారిని మతంలోకి మార్చి బుర్గా ధరించి ప్రార్థనలు చేయాలని బలవంతం చేసేవారని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫోన్‍లో అనుమానాస్పద గ్రూప్‍లు:
అరెస్టు తర్వాత నిందితులు అమ్రీన్, అఫ్రీన్, చందన్ మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోఅమ్రీన్ ఫోన్‌లో అనేక అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులు కనుగొన్నారు.అలాగే అనేక మంది యువతీ ఫోటోలు కూడా ఉండటంతో వీరి వెనుక ఉన్న నెట్ వర్క్ ఏంటి? వీరి ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఛత్తీస్ గఢ్‍లోని ముంగెలి జిల్లాకు చెందిన బ్యూటీషియన్ గా పని చేస్తున్న ఓ మహిళను వీరు 2025 లో డిసెంబర్ లో ఉపాధి నిమిత్తం అహ్మదాబాదాద్ కు తీసుకువెళ్లారు. అక్కడ అమ్నీన్ బంధువు యాసిర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మరో మహిళ ఫిర్యాదుతో వీరి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో వీరి బాగోతాలు ఇంకెన్ని బయటపడతాయనేది ఉత్కంఠ రేపుతోంది.






