- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త జిల్లాలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు బ్రేక్
రాష్ట్రంలో కొత్త వార్డులు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల ఏర్పాటుకు బ్రేక్‌పడనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త వార్డులు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల ఏర్పాటుకు బ్రేక్‌పడనుంది. జనగణన నేపథ్యంలో డిసెంబర్31 తర్వాత కొత్త వాటిని ఏర్పాటు చేయవద్దని జనగణన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జనగణనలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో హౌస్లిస్టింగ్చేస్తారు. దీని కోసం జనవరి నుంచే కసరత్తు మొదలుకానున్నది. ఇందుకోసం గ్రామాలు, వార్డులు, మండలాలు, జిల్లాలకు కోడ్‌లు కేటాయిస్తారు. వీటి ఆధారంగా సర్వే చేయడంతో పాటు వివరాలు ప్రకటిస్తారు. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు డిసెంబర్31 డెడ్‌లైన్‌గా పెట్టుకొని కొత్త వార్డులు, గ్రామం, మండలం, జిల్లాల ఏర్పాటుపై ఫ్రీజింగ్చేస్తారు. జనగణన పూర్తయ్యే వరకు కొత్తవి ఏర్పాటు చేయవద్దని, ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తే వాటిని తాము పరగణలోకి తీసుకోబోమని జనగణన అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్31 ముందు ఏర్పడిన వాటి ఆధారంగానే డేటాను విడుదల చేస్తారు.
దీనినే నియోజకవర్గాల పునర్విభజనకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేసే ప్రాంతాల ప్రక్రియను పూర్తి చేశాయి. డిసెంబర్ 31 వరకు ఉన్న జాబితాలను జనవరి మొదటి వారంలో జనగణన అధికారులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అధికారికంగా పంపించనున్నారు. అనంతరం వాటికి కోడ్‌లను కేటాయిస్తారు. జనవరిలో కేంద్ర జనగణన అధికారులు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు దేశ వ్యాప్తంగా జనగణన చేస్తారు. అందులో భాగంగానే కులగణన సైతం చేపడతారు. రాష్ట్రంలో ఇప్పటికే శాంపిల్హౌస్లిస్టింగ్పై అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫిడ్ బ్యాక్ఆధారంగా మార్పులు చేర్పులు చేశారు.






