భారత్ - ఒమన్ మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం

by Muthe.Rajitha |

భారత్‌ - ఒమన్‌ మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదిరింది.

భారత్ - ఒమన్ మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్‌ - ఒమన్‌ మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్(CEPA)పై ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, ఒమన్‌ మంత్రి కియాస్‌ బిన్‌ మొహమ్మద్‌లు సంతకాలు చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ ప్రస్తుతం ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఒమన్ ప్రధాని, సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిక్‌తో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, ప్రజా సంబంధాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు.

ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తైన వేళ ఈ ఒప్పందం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రధాని మోడీకి ఒమన్‌ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ను సుల్తాన్‌ హైతమ్‌ బిన్‌ తారిక్‌ అందజేసిన సంగతి తెలిసిందే.

Next Story