జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికుల వీర మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-09 03:39:52  IST  )

పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు సైనికుల వీర మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) తర్వాత కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సరిహద్దుల వెంట దేశంలో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను అంతం చేయాలని భద్రతాదళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో దక్షిణ కాశ్మీర్‌ (South Kashmir)లోని కుల్గామ్ (Kulgam) జిల్లాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గత ఎనిమిది రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుత్రికి తరలించగా.. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్ జిల్లా పరిధిలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జమ్మూకశ్మీర్ పోలీసులతో సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలు కలిసి ‘ఆపరేషన్ అఖాల్’ పేరుతో జాయింట్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కనీసం ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధాలతో కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోందని భద్రతా దళాలు తెలిపాయి.

Next Story