సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం వేట.. ఊపిరాడక నలుగురి మృతి

by Naga Rani Yarlagadda |

సీతాపుర పారిశ్రామిక ప్రాంతం (Sitapura Industrial Area)లోని బంగారం, వెండి కణాలను తిరిగి పొందడానికి సెప్టిక్ ట్యాంక్‌లోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు విషపూరిత వాయువుల కారణంగా మరచించినట్లు పోలీసులు తెలిపారు.

సెప్టిక్‌ ట్యాంక్‌లో బంగారం వేట.. ఊపిరాడక నలుగురి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ దుకాణం యజమాని అత్యాశ నలుగురి ప్రాణాలను బలిగొంది. సెప్టిక్‌ ట్యాంక్‌ (Septik Tank)లో పేరుకుపోయిన బంగారం మడ్డిని తీసుకురావడానికి నలుగురు కూలీలను పురమాయించాడు ఆ యజమాని. తొలుత వారు ఈ పనిచేయడానికి నిరాకరించగా.. ఎక్స్ ట్రా మనీ ఇస్తానని ఆశచూపించడంతో ఒప్పుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన రాజస్థాన్‌ (Rajastan)లోని జైపుర్‌లో జరిగింది.

సీతాపుర పారిశ్రామిక ప్రాంతం (Sitapura Industrial Area)లోని బంగారం, వెండి కణాలను తిరిగి పొందడానికి సెప్టిక్ ట్యాంక్‌లోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు విషపూరిత వాయువుల కారణంగా మరచించినట్లు పోలీసులు తెలిపారు. జ్యువెలరీ జోన్‌లోని జి-బ్లాక్‌లోని ఒక జ్యువెలరీ ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన కార్మికులను సంజీవ్ పాల్, హిమాన్షు సింగ్, రోహిత్ పాల్, అర్పిత్ యాదవ్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కార్మికులైన అజయ్ చౌహాన్, రాజ్‌పాల్‌లను విషమ పరిస్థితిలో మహాత్మా గాంధీ ఆసుపత్రి (Mahatma Gandhi Hospital)కి తరలించగా.. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.

కార్మికులు 10 అడుగుల లోతు గల ట్యాంక్‌లోకి దిగి, ఆ తర్వాత స్పృహ కోల్పోయారని పోలీసులు తెలిపారు. తొలుత ట్యాంక్ లో తీవ్రమైన వేడి, విష వాయువులు ఉండటం వల్ల కార్మికులు ట్యాంక్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించారు. అయితే.. కంపెనీ యాజమాన్యం అదనపు డబ్బు ఇస్తామని హామీ ఇచ్చి వారిని ఒప్పించిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ట్యాంక్‌లోకి మొదట దిగిన అమిత్, రోహిత్ ఊపిరి పీల్చుకుంటూ వెంటనే సహాయం కోసం పిలవడం ప్రారంభించారు. మిగిలిన ఆరుగురు మొదటి ఇద్దరిని బయటకు తీసుకురావడానికి త్వరగా ట్యాంక్‌లోకి దిగి స్పృహ కోల్పోయారు.

సెప్టిక్ ట్యాంక్‌లో రసాయనాలతో కూడిన బురద ఉందని, ఆభరణాల తయారీ, శుభ్రపరిచే ప్రక్రియల ద్వారా కెమికల్స్ బంగారం, వెండి కణాలను తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాటి కోసమే యాజమాన్యం కార్మికులను సెప్టిక్ ట్యాంక్ లోకి పంపిందన్నారు. కాగా.. ఈ ఘటనపై రాజస్థాన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Rajasthan State Human Rights Commission) జైపూర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ (Jaipur Collector and Police Commissioner)లకు నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ జిఆర్ మూలచందాని (G R Moolchandani).. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేసి, దోషులపై చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కూడా స్పందించారు. 10 రోజుల్లో డీగ్, బికనీర్, జైపూర్‌లలో సెప్టిక్ ట్యాంకులు, గట్టర్లను శుభ్రం చేస్తూ 11 మంది మరణించారని, ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోవడం లేదన్న విషయం తేటతెల్లమవుతోందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. బడ్జెట్‌లో యంత్రాలను కొనుగోలు చేస్తామని ప్రకటించింది కానీ.. ఆ ప్రకటన కాగితాల వరకే పరిమితమైందని విమర్శించారు. ఇక ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుంది? అని ప్రశ్నించారు.

Next Story