- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎర్రకోట పేలుడు కేసు.. మరో నలుగురు అరెస్ట్
నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పేలుడులో 15 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) నేడు మరో నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహాయంతో NIA ఈ నలుగురిని అదుపులోకి తీసుకుంది.
పాటియాలా హౌస్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం NIA కస్టడీలో 10 రోజుల పాటు ఉంచనున్నారు. అరెస్టైన వారిలో పుల్వామా, జమ్మూ కాశ్మీర్ కు చెందిన ముజమ్మిల్ షకీల్ పేలుడులో మరణించిన ప్రధాన ఉగ్రవాది ఉమర్ ఉల్ నబీ దగ్గర అత్యంత సన్నిహితుడు. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అనంతనాగ్ కు చెందిన అదీల్ అహ్మద్ సహారన్‌పూర్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
పేలుడు కుట్రలో ఆయుధాల సరఫరా, లాజిస్టిక్స్‌లో పాత్ర పోషించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. యూపీలోని లక్నోకు చెందిన డా. షహీన్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మహిళా డాక్టర్. మరో నిందితుడు ముఫ్తి ఇర్ఫాన్ అహ్మద్ మాజీ పారామెడిక్‌గా పనిచేశాడు. ఇతను డాక్టర్లను రాడికలైజ్ చేసినట్టు NIA ఆరోపిస్తోంది.






