- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తులు అదృష్యం
by Ajay Maddhiboyina |
అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అదృష్యం అయ్యారు. వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఓ టెంపుల్ కు వెళుతూ నలుగురు సీనియర్

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అదృష్యం అయ్యారు. వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఓ టెంపుల్ కు వెళుతూ నలుగురు సీనియర్ సిటిజన్లు కనిపించకుండా పోయారని పోలీసులు చెబుతున్నారు. మిస్ అయిన వారు కిశోర్ దివాన్, ఆశా దివాన్, గీతా దివాన్, శైలేష్ దివాన్ అని తెలుస్తోంది. చివరిగా వారిని జూలై 29న పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్ లో గుర్తించారు. వారంతా చివరిసారిగా రెస్టారెంట్ లోనే కలినిపించారని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా తెలిసిందన్నారు. అదే రెస్టారెంట్ లో క్రెడిట్ కార్డ్ చివరిసారిగా వాడినట్టు తెలుసుకున్నారు. మిస్ అయినవారి ఆచూకీ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా స్పందించింది. వారు క్షేమంగా ఉన్నారనే వార్త కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది.
Next Story






