- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలోని నలుగురు పిల్లలు మృతి: యూపీలో అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా ఒకే కుటుంబంలోని నలుగురు పిల్లలు మృతి చెందగా..వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగగా ఒకే కుటుంబంలోని నలుగురు పిల్లలు మృతి చెందగా..వారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మీరట్ జిల్లాలోని పల్లవపురం ప్రాంతంలోని జనతా కాలనీలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్య్కూట్ జరగగా.. మంటలు వేగంగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు గాయపడిన కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి నలుగురు పిల్లలు మరణించారు. వారిని సారిక(10), నిహారిక(8), సంస్కర్ అలియాస్ గోలు(6), కలు(4)గా గుర్తించారు. తల్లిదండ్రులు జానీ, బబితలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో బబిత పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే మంటలు బెడ్ షీట్‌కు అంటుకుని వేగంగా వ్యాపించాయని జానీ పోలీసులకు చెప్పారు.






