- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలలో కూలిన గోడ.. నలుగురు చిన్నారులు మృతి
by Gantepaka Srikanth |
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. రాష్ట్రంలో రేవా పాఠశాలలో ఈ ఘటన జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. రాష్ట్రంలో రేవా పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కాగా, ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్‌లో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రెండ్రోజుల క్రితం మెరెనా జిల్లాలో ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు కావడి యాత్రికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 14మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన మరో మూడు గంటల్లోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. భోపాల్ పట్టణంలో బైక్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమదాలను మరువకముందే స్కూళ్లో గోడ కూలి నలుగురు చిన్నారులు మృతిచెందడం కలకలం రేపుతోంది.
Next Story






