- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ కాలుష్యంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆందోళన
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఢిల్లీ వాయి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో... ఢిల్లీ నుండి రాంచీ మార్గంలో ప్రయాణిస్తున్నానని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఢిల్లీ వాయి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో... ఢిల్లీ నుండి రాంచీ మార్గంలో ప్రయాణిస్తున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో ఎల్లప్పుడూ తక్కువ నాణ్యత కలిగిన గాలి ఉండటం తనను ఆందోళన పెట్టిస్తోందని చెప్పారు. సౌత్ గోవా దగ్గరలోని ఓ చిన్న మత్స్యకార గ్రామంలో నివసిస్తున్నందుకు చాలా గొప్పగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా బీచ్ లో తన పిల్లలు ఫుట్ బాల్ ఆడుతున్న మరో ఫోటోను సైతం జాంటీ రోడ్స్ షేర్ చేశారు.
ఈ విధంగా మా ఇంటివద్ద సూర్యాస్తమయం ఉంటుందని పేర్కొన్నారు. తన పిల్లలు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని, కానీ ఢిల్లీలో ఇళ్లకే పరిమితం అవ్వాలని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. ప్రస్తుతం అక్కడ సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 606 పాయింట్లు నమోదవ్వగా, కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా 900 పాయింట్లకు చేరుకుంది.






