2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు వెనుక మాజీ ప్రధాని.. ఆంగ్ల పత్రిక ఏఎఫ్‌పీ సంచలన కథనం

by Kema Shiva Kumar |

2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ (Bangladesh Rifles) తిరుగుబాటు వెనుక మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) హస్తం ఉందని బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిషన్ ఆరోపించింది.

2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటు వెనుక మాజీ ప్రధాని.. ఆంగ్ల పత్రిక ఏఎఫ్‌పీ సంచలన కథనం
X

దిశ, వెబ్‌డెస్క్: 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ (Bangladesh Rifles) తిరుగుబాటు వెనుక మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) హస్తం ఉందని బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిషన్ ఆరోపించింది. అయితే, అందుకు సంబంధించి ఆంగ్ల వార్తా సంస్థ ఏఎఫ్‌పీ సంచలన కథనాన్ని ప్రచురించింది. 2009లో జరిగిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ తిరుగుబాటుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా నేరుగా ఆమోదం ఇచ్చారని, భారత్ కూడా ఈ కుట్రలో పాలుపంచుకుందని కమిషన్ నివేదికలో వెల్లడించింది. ఈ రెండు రోజుల తిరుగుబాటులో 74 మంది మరణించారు. ఈ ఘటన హసీనా 2009లో అధికారంలోకి వచ్చిన కొద్ది వారాల్లోనే జరిగింది.

చివరికి సత్యం బయటపడింది.. మహమ్మద్ యూనస్

షేక్ హసీనా దేశంలో ఆర్మీ నాయకత్వాన్ని అంతం చేసి తన అధికారాన్ని బలోపరచుకోవాలని కుట్ర పన్నారని నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. అందులో అప్పటి అవామీ లీగ్ ఎంపీ ఫజ్లే నూర్ తాపోష్ (MP Fazle Noor Taposh) ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారని పేర్కొన్నారు. భారత్ పట్ల భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ.. బంగ్లాదేశ్‌లో అస్థిరత సృష్టించి సైన్యాన్ని బలహీనపరచాలని షేక్ హసీనా కుట్ర చేసిందని ఆరోపించారు. తిరుగుబాటు సమయంలో 921 మంది భారతీయులు బంగ్లాదేశ్‌లోకి వచ్చారని, వారిలో 67 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని కమిషన్ చైర్మన్ ఏఎల్ఎం ఫజ్లుర్ రహమాన్ (ALM Fazlur Rahman) పేర్కొన్నారు. అయితే, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నివేదికను విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే యూనస్ మాట్లాడుతూ.. చివరికి సత్యం బయటపడిందని కామెంట్ చేశారు. కాగా, భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ మరోసారి డిమాండ్ చేసింది. గత నెల 17న హసీనాకు మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నివేదికతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తిరుగుబాటును జవాన్ల వేతన డిమాండ్లకు ఆపాదించగా.. కాలానుగుణంగా అది కాస్త రాజకీయ కుట్రగా మారింది.

Next Story