- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఒకే దేశం ఒకే ఎన్నిక'.. దేశాభివృద్ధికి కీలకం: మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
'ఒకే దేశం ఒకే ఎన్నిక పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు

దిశ, వెబ్ డెస్క్: 'ఒకే దేశం ఒకే ఎన్నిక పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. (ONOE) పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) చైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందిస్తూ.. ONOE పై ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రెండు బిల్లులను రూపొందించి, వాటిని 2024లో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆ రెండు బిల్లులు JPC వద్ద పరిశీలనలో ఉన్నాయి. దేశంలో ఈ ONOE విధానం అమల్లోకి వస్తే, అది భారతదేశ అభివృద్ధికి ఒక గేమ్-ఛేంజర్‌గా మారుతుందని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం.. ప్రతి సంవత్సరం 4-5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయని, దీని వల్ల మన మొత్తం పరిపాలనా యంత్రాంగం అందులో నిమగ్నమవుతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో అత్యంత ఎక్కువగా నష్టపోయేది మన విద్య వ్యవస్థ అని, ఎందుకంటే ఎన్నికల ఉద్యోగులలో అత్యధికంగా ఉపాధ్యాయులే ఉంటారని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు.






