కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ CM కన్నుమూత

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-21 11:03:38  IST  )

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ CM కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు(CPIM)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గుండెపోటుతో గతనెల 23వ తేదీన ఆసుపత్రిలో చేరిన ఆయన(VS Achuthanandan).. పరిస్థితి విషమించి సోమవారం మధ్యా్హ్నం కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి కమ్యూనిస్టు నేతలంతా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పార్టీలకు అతీగంగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా, 2006 నుంచి 2011 వరకు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు.

ఇదిలా ఉంటే.. గత సంవత్సరం అక్టోబర్‌లో ఆయన 101 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1923 అక్టోబర్ 20న అలప్పుజ జిల్లాలోని పున్నప్రాలో ఒక కార్మిక కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అచ్యుతానందన్ 1939లో స్టేట్ కాంగ్రెస్‌లో చేరారు. 1940లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. 15 సంవత్సరాలు వరుసగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన చివరిసారిగా 2016 నుండి 2021 వరకు క్యాబినెట్ హోదాతో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఛైర్మన్‌గా ప్రభుత్వ పదవిలో ఉన్నారు.

Next Story