గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-12 12:25:31  IST  )

గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(Vijay Rupani) మృతిచెందారు.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ(Vijay Rupani) మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే విజయ్ రూపానీ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, విజయ్ రూపానీ 2016 నుంచి 2020 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కాగా, ఈ ప్రమాదంలో మొత్తం 240 మంది ప్రయాణికులూ చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విమానం బీజే మెడికల్‌ కాలేజీపై కూలడంతో కాలేజీలో ఉన్న 20 మందికి మెడికోలు మృతిచెందారు. ఒకేరోజు వందల సంఖ్యలో పౌరులు చనిపోవడం పెను విషాదంగా మారింది. ప్రమాద సమయంలో విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు, విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నారు.

Next Story