- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TamiliSai : మాజీ గవర్నర్ తమిళిసై అరెస్ట్
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్(Telangana Former Governor Tmilisai) పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్(Telangana Former Governor Tmilisai) పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన త్రిభాషా విధానం ప్రస్తుతం తమిళనాడు(Tamilanadu)లో తీవ్ర వివాదాస్పదం అవుతోంది. త్రిభాషా వివాదంపై బీజేపీ(BJP)కి, డీఎంకే(DMK) పార్టీలు పోటీ పడి నిరసనలు, ప్రతి నిరసనలు తెలుపుతున్నాయి. తమిళ్, ఇంగ్లీష్, హిందీ భాషలు కచ్చితంగా నేర్చుకోవాలన్న విధానానికి వ్యతిరేకంగా తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నిరసనలు చేస్తూ.. తమిళ భాషను చంపేందుకే హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారంటూ బీజేపీపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే డీఎంకే చేస్తున్న నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ రంగంలోకి దిగింది. త్రిభాషా విధానం.. తమిళనాడులో హిందీకి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టింది. ఈ క్రమంలోనే చెన్నై సిటీలో జాతీయ విద్యా విధానానికి మద్దతుగా సంతకాల సేకరణకు పిలుపునిచ్చింది.
ఇందులో భాగంగా తమిళిసై ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ విషయం తెలిసిన డీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంజీఆర్ నగర్ చేరుకున్నారు. తమిళసై ప్రచారాన్ని అడ్డుకున్నారు. బీజేపీ డౌన్ డౌన్.. గో బ్యాక్ బీజేపీ, తమిళ ద్రోహి పార్టీ బీజేపీ అంటూ నినాదాలు చేశారు. డీఎంకే కార్యకర్తల నిరసనలకు కౌంటర్ గా బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.. డీఎంకే డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. దీంతో ఎంజీఆర్ నగర్ లో డీఎంకే, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నిరసనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సంతకాల సేకరణకు అనుమతి లేదని.. పర్మీషన్ లేకుండా ఎలా ప్రచారం చేస్తారంటూ తమిళిసైను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.






