కోడలితో మాజీ డీజీపీకి అక్రమ సంబంధం... అడ్డు తొలగించుకునేందుకు కుమారుని హత్య!

by Muthe.Rajitha |   (  Updated:2025-10-21 11:20:04  IST  )

పంజాబ్‌(Panjab)లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖీల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టించింది.

కోడలితో మాజీ డీజీపీకి అక్రమ సంబంధం... అడ్డు తొలగించుకునేందుకు కుమారుని హత్య!
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్‌(Panjab)లో మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫా కుమారుడు అఖీల్ అఖ్తర్ మృతి ఘటన సంచలనం సృష్టించింది. తొలుత అది అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ.. ఇప్పుడు హత్య కేసుగా మారడం హాట్ న్యూస్ అయింది. తన భార్యతో తండ్రికి అక్రమ సంబంధం ఉందని అఖీల్ మరణానికి ముందు ఆరోపించిన వీడియో బయటకు రావడంతో కేసు చర్చనీయాంశమైంది. పోలీసులు కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేశారు. 33 ఏళ్ల అఖీల్ అక్టోబర్ 16న పంచకులలోని ఇంట్లో స్పృహ కోల్పోయి మరణించాడు. డ్రగ్ ఓవర్‌డోస్ కారణమని తల్లిదండ్రులు చెప్పగా, పోలీసులు అనారోగ్యంతో మరణం అని నిర్ధారించారు.

తండ్రి ముస్తాఫా మాజీ డీజీపీ, కాగా తల్లి రజియా సుల్తానా మాజీ మంత్రి. అఖీల్ మరణానంతరం అతని స్నేహితులు అది హత్య అని ఆరోపించారు. ఆగస్టు 27న రికార్డు చేసిన వీడియోలో... "నా భార్యకు తండ్రితో సన్నిహిత సంబంధం ఉంది. వాళ్లు నన్ను పిచ్చోడిని చేసేందుకు, చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లి, సోదరి కూడా కుట్రలో ఉన్నారు’" అని చెప్పాడు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Read more: కోడిని హలాల్ చేసినట్టే మహిళా మెడకాయను కోసేసిన దుండగులు

Next Story