సాయం కోసం వెళ్తే రేప్ చేశాడు.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వీడియోలు వైరల్

by Dishanational4 |
సాయం కోసం వెళ్తే రేప్ చేశాడు.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వీడియోలు వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవారాం జైన్‌కు సంబంధించిన రెండు ప్రైవేటు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఓ మహిళను మేవారాం జైన్‌ వేధిస్తున్నట్లుగా ఆ వీడియోల్లో ఉంది. ‘‘ఐదేళ్ల కిందట నా తండ్రి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ప్రభుత్వ సాయం ఇప్పించాలని కోరుతూ అప్పట్లో నేను మేవారాం జైన్‌‌ను కలిశాను. ఆ సమయంలో ఆయన నాపై అత్యాచారం చేశాడు. నా కుమార్తె ఎదుటే నన్ను వేధించాడు’’ అని బాధిత మహిళ ఆరోపించింది. మేవారాం జైన్ సహా 9 మంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు మహిళ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోల వివరాలను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

చివరకు మేవారాం జైన్‌ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో మేవారం జైన్‌ వీడియోలను షేర్ చేశారు. అతడిపై విరుచుకుపడటంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ నేత మేవారాం బాధితులను పరామర్శిస్తారా అంటూ ప్రియాంకాగాంధీని ప్రశ్నించారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేస్తారా అని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed