Breaking News : లిక్కర్ స్కాం కేసు.. మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

by Muthe.Rajitha |

దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోరు చేసుకుంది.

Breaking News : లిక్కర్ స్కాం కేసు.. మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోరు చేసుకుంది. లిక్కర్ స్కాం(Liquor scam)లో మాజీ సీఎం కుమారుడిని ఈడీఅరెస్ట్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)కు మాజీ సీఎం భూపేష్ భఘేల్(Former CM Bhupesh Baghel) కుమారుడు చైతన్య భఘెల్(Chaitanya Baghel) ను మనీ లాండరింగ్ కేసులో శుక్రవారం ఈడీ అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం, ఆయన కుమారుని నివాసంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ తనిఖీలు నిర్వహించిన అనంతరం చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్ట్ అనంతరం భూపేష్ భఘెల్ " ఈరోజు అసెంబ్లీలో అదాని అంశం మాట్లాడాల్సి ఉందని , అందుకే సార్ ED ని ఇంటి మీదికి పంపించారు" అంటూ సంచలన ట్వీట్ చేయడం గమనార్హం.

Next Story