- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : ప్రమాదంలో మాజీ సీఎం లేరు : వ్యక్తిగత సహాయకుని ప్రకటన
అహ్మదాబాద్‌లోని మేఘానిలో ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్‌లోని మేఘానిలో ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఇండియా(Air India Flight Crash)కు చెందిన AI 171 బోయింగ్ విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్, బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani), మరికొంతమంది నేతలు ఉన్నట్టు ప్రచారం జరిగింది.
అయితే ఆయన వ్యక్తిగత సహాయకుడు మాత్రం విజయ్ రూపానీ కూలిన విమానంలో లేరని స్పష్టం చేశారు. ఆయన అంతకముందే వేరే విమానంలో లండన్ వెళ్లారని, ఆయన పేరు మాత్రం ఈ లిస్టులో ఉందని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో 150 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరోవైపు మెడికల్ కాలేజీకి చెందిన 20 మంది మెడికోలు కూడా దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






