మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకానని వెల్లడి

by Kema Shiva Kumar |

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు.

మాజీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకానని వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case) విచారణలో భాగంగా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై జరుగుతున్న విచారణను నిరసిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ (Justice Swarna Kanta Sharma)కు ఓ లేఖ రాశారు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరుకావడానికి నిరాకరిస్తున్నానని, తన పోరాటాన్ని ‘సత్యాగ్రహం’గా పరిగణించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో ఎక్సైజ్ పాలసీ కేసులో తనను విచారించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్రంలోని అధికార పార్టీ తనను, తన పార్టీని అస్థిరపరచడానికే ఈ అక్రమ కేసులను వాడుకుంటోందని ఆయన లేఖలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తాను గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్నానని, అందుకే ఈ విచారణకు హాజరుకావడం లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

ఢిల్లీ హైకోర్టు స్పందనపై ఉత్కంఠ..

కాగా, ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్, ఇప్పుడు ఆయన రాసిన ఈ లేఖ, విచారణకు హాజరుకాకపోవడంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించడం వల్ల ఆయన మరిన్ని చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

Next Story